

భారత సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల ముంబయి క్రికెటర్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. 2009 నుంచి 2021 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పూనమ్ తన కెరీర్లో నాలుగు టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ముఖ్యంగా వన్డే క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకుంది. భారత మహిళల జట్టులో కీలక బ్యాటర్గా వ్యవహరించిన ఆమె, పలు సందర్భాల్లో జట్టుకు విలువైన పరుగులు అందించింది.
పూనమ్ రౌత్ వన్డేల్లో మూడు శతకాలతో కలిపి మొత్తం 2,288 పరుగులు సాధించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు అర్ధశతకాల సాయంతో 719 పరుగులు చేసింది. ఆమె కెరీర్లో 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ టోర్నీలో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచిన భారత జట్టులో పూనమ్ సభ్యురాలిగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!