

ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్ అధికారిగా వ్యవహరించేందుకు ఎంపికైన సోమాలియా రెఫరీ ఒమర్ అబ్దుల్ఖదీర్ అర్టాన్కు అమెరికా అధికారులు షాక్ ఇచ్చారు. టోర్నమెంట్ విధుల్లో పాల్గొనేందుకు ఇస్తాంబుల్ నుంచి మయామికి చేరుకున్న అర్టాన్ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశంలోకి అనుమతించకుండా ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించారు. ఆయన వద్ద చెల్లుబాటు అయ్యే వీసాతో పాటు అన్ని అవసరమైన పత్రాలు ఉన్నప్పటికీ ప్రవేశానికి అనుమతి లభించలేదు.
ఈ ఘటన తర్వాత అర్టాన్ వరల్డ్‌కప్‌లో భాగం కాబోరని ఫిఫా అధికారికంగా ప్రకటించింది. అదనపు తనిఖీలు, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ప్రవేశం నిరాకరించినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్న దేశాల్లో సోమాలియా కూడా ఒకటి. 2025లో ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రెఫరీగా గుర్తింపు పొందిన అర్టాన్, ఫిఫా ఎంపిక చేసిన 52 మంది ఎలైట్ రెఫరీల జాబితాలో చోటు సంపాదించడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!