

భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో టీమిండియా విజయానికి 199 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. అతడు 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లోనే మిచెల్ న్యూజిలాండ్ తరఫున 2,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఫిన్ అలెన్ 40 పరుగులతో రాణించగా, బెవోన్ జాకబ్స్ అజేయంగా 39 పరుగులు సాధించాడు.

మరోవైపు, టిమ్ సీఫెర్ట్ రెండు పరుగులకే వెనుదిరగగా, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 40 పరుగులు, ప్రిన్స్ యాదవ్ 44 పరుగులు సమర్పించుకున్నారు. అయితే అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి పరుగులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. ఇప్పుడు 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించాలంటే భారత బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!