

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లింక్డ్‌ఇన్‌లో చేరారు. ఈ సందర్భంగా క్రికెట్‌తో తనకున్న అనుబంధం, ఫిట్‌నెస్‌పై నిబద్ధత, భవిష్యత్తు వ్యాపార లక్ష్యాల గురించి పంచుకున్నారు. 18 ఏళ్లుగా క్రికెట్ మైదానం తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. భారత జెర్సీ ధరించడం తనకు లభించిన గొప్ప గౌరవమని, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి కావడం ప్రత్యేక అనుభవమని వివరించారు.
అజిలిటాస్‌లో పెట్టుబడిదారుగా చేరిన కోహ్లీ, one8world బ్రాండ్‌ను భారత్ నుంచి ప్రపంచ స్థాయి హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, వినూత్న ఆలోచనలతో స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తులను రూపొందించడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది. భారత్‌లో ఫిట్‌నెస్ జీవనశైలిగా మారుతున్న నేపథ్యంలో క్రీడా దుస్తులు, ఫిట్‌నెస్ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!