
ఓటీటీ

కెనడా ప్రభుత్వం కొత్త డిజిటల్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించడంతో పాటు AI చాట్బాట్లపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు AI వ్యవస్థల కోసం కొత్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలకు గ్లోబల్ ఆదాయంలో 3 శాతం లేదా 10 మిలియన్ కెనడియన్ డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఆందోళన, ఒంటరితనం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా వంటి దేశాల తర్వాత కెనడా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!