
జనరల్

పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాగే పెట్టుబడిగా కూడా ఇది ఎంతో ప్రాధాన్యం కలిగిన లోహం. వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. 24 క్యారెట్లు 99.9% స్వచ్ఛమైన బంగారం కాగా, ఆభరణాల తయారీలో సాధారణంగా 22 క్యారెట్ల బంగారం ఉపయోగిస్తారు.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ మరియు డాలర్ మారకపు విలువపై ఆధారపడి మారుతుంటాయి. కొన్ని దుకాణాలు పన్నులు కలపకుండా ధరలు చూపుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం. మేకింగ్ ఛార్జీలు దుకాణానికి దుకాణం మారుతాయి. నాణ్యత, హామీ, సర్వీస్ కోసం తప్పనిసరిగా బిల్లుతోనే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!