

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,240గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.110 పెరుగుదల. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,300గా ఉండగా, దీనిలో కూడా రూ.110 పెరుగుదల నమోదైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ధరలు ఒకే స్థాయిలో కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390గా ఉండగా, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళలో రూ.1,43,240గా నమోదైంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరలను పరిశీలించడం మంచిది.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!