

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పెరుగుతున్న ధరలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.
వేతన జీవులు, పదవీ విరమణ చేసినవారు, చిన్న వ్యాపారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరలు, విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, రుణాల వాయిదాలు పెరగడంతో కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రెడిట్ కార్డు బాకీలు, అధిక రుణభారం, అత్యవసర నిధుల కొరత ప్రధాన హెచ్చరికలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
కనీసం తొమ్మిది నుంచి పన్నెండు నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడుల్లో పది నుంచి పదిహేను శాతం బంగారానికి కేటాయించడం, బీమా రక్షణను పెంచుకోవడం, అదనపు ఆదాయ మార్గాలు ఏర్పరచుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అవసరమని చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!