

ఆదాయపు పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా ఫిషింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. రూ.6 వేల పన్ను బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని పేర్కొంటూ ఆదాయపు పన్ను శాఖ పేరుతో నకిలీ ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ పంపుతున్నట్లు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది. ఇలాంటి నోటీసులు నకిలీవి కావచ్చని, వాటిలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది.
ఈ ఫేక్ లింక్‌లపై క్లిక్ చేస్తే ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను నమోదు చేస్తే వాటిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. నిజమైన ఐటీ నోటీసు వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి నేరుగా వెళ్లి లాగిన్ అయి Pending Actions లేదా e-Proceedings విభాగాలను తనిఖీ చేయాలి. ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లలో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయకూడదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!