

హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బీ మెట్రో పిల్లర్ నెం. 741 వద్ద ప్రముఖ వస్త్ర బ్రాండ్ ది సిగ్నేచర్ సిల్క్స్ తన నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ స్టార్ శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వినియోగదారులు, ఫ్యాషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. డైరెక్టర్ ప్రకాశ్ సింగ్ గెహ్లాట్, మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ సింగ్ గెహ్లాట్ అతిథులను ఆహ్వానించి సంస్థ లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, ది సిగ్నేచర్ సిల్క్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. షోరూమ్‌లో అందుబాటులో ఉన్న సిల్క్ చీరలు, బ్రైడల్ కలెక్షన్స్, డిజైనర్ ఎథ్నిక్ వేర్ నాణ్యతను ప్రశంసించారు. ప్రతి వయస్సు వారికి, ప్రతి ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా అత్యుత్తమ వస్త్రాలను ఒకే చోట అందుబాటులో ఉంచామని యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లో లగ్జరీ సిల్క్ చీరలు, వివాహ వేడుకల దుస్తులు, పండుగల ప్రత్యేక వస్త్రాల కోసం ఈ షోరూమ్ ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!