
బిజినెస్

టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. కమోడిటీలు, ఇతర ముడి పదార్థాల ఇన్‌పుట్ వ్యయాలు పెరగడంతో ధరలను సవరించినట్లు కంపెనీ వెల్లడించింది. పెంచిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల ప్రభావాన్ని సమతుల్యం చేసుకునేందుకు ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!