
రాజకీయాలు

హైదరాబాద్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పైడిపోగు రాజేష్ (27)కు ఈ శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు రూ.6,100 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
వివరాల ప్రకారం.. రాజేష్ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ తర్వాత మాట మార్చినట్లు కేసు వివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఎల్‌బీనగర్ కోర్టు 13వ అదనపు న్యాయమూర్తి వాణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.6,100 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!