
రాజకీయాలు

మద్రాస్ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈనెల 5న రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 17 మంది కలెక్టర్లు, 17 మంది ప్రిన్సిపల్ కార్యదర్శులు కలిపి మొత్తం 34 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో భాగంగా న్యాయమూర్తుల ఎదుట హాజరయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అంతా ఒకే రోజు కోర్టులో హాజరై, తమ హాజరు నమోదు అయ్యే వరకు వేచి ఉన్నట్లు సమాచారం. ఇటీవల బదిలీ అయిన ఓ మహిళా కలెక్టర్‌ను కూడా హాజరుకావాలని ఆదేశించడంతో ఆమె విమానంలో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం తదుపరి విచారణ నుంచి మినహాయింపు కోరుతూ ఆమె తన కొత్త జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!