
జనరల్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అనుగుణంగా ఆదాయ వనరుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2026-27 బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా లక్ష్యాలను చేరుకునేలా అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని సూచించారు.
ఆదాయ లీకేజీలను కట్టడి చేయడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం, ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని భట్టి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన కాలపట్టిక ప్రకారం ఆదాయ లక్ష్యాలను సాధించాలని సూచించారు. వివిధ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!