
ఓటీటీ

జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతం లేహ్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని NCS పేర్కొంది. భూకంపాలు భూమి ఉపరితలానికి సమీపంలో నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవించవచ్చని తెలిపింది. యూఎస్‌జీఎస్ డేటా ప్రకారం భూకంపాల లోతు 0 నుంచి 700 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వివరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!