

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఆగ్రాలోని ఆయన పూర్వీకుల నివాసం వద్ద నిరసన చేపట్టారు. విజయ్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఇంటి ప్రధాన గేటు, గోడలపై నల్ల రంగు పూసి, సీఈసీని లక్ష్యంగా చేసుకుని నినాదాలు రాసినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నిరసనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు ఇంటి బయట కరపత్రాలు, స్టిక్కర్లు ఏర్పాటు చేసి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!