

బిగ్‌బాస్ తెలుగు 10లో నాలుగో వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్‌తో ప్రారంభమైంది. మొదటి రోజే ఇంటి సభ్యులను ‘టీమ్ భైరవ’, ‘టీమ్ సప్త శక్తి’గా రెండు బృందాలుగా విభజించారు. దీంతో ఇంట్లో మాటల యుద్ధాలు, వాగ్వాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. టాస్క్‌లో శ్రిష్టికి గాయమైనట్లు కనిపించగా, ముఖేష్ కాలికి కూడా గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగో వారం ఆరంభంలోనే హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది.
కెప్టెన్ అపూర్వ, ముఖేష్ మధ్య డిష్ వాషింగ్ బాధ్యతలు, కెప్టెన్ గది ఖాళీ చేయడం వంటి విషయాల్లో గొడవ జరిగింది. సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు చెబితే తాను పాటిస్తానని ముఖేష్ చెప్పడంతో అపూర్వ వెంటనే మీటింగ్ పెట్టింది. అక్కడ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. కెప్టెన్‌కు గౌరవం ఇవ్వాలని అపూర్వ సూచించగా, తనను ‘కెప్టెన్ అపూర్వ’ అని పిలవాలని నిబంధన పెట్టింది. అయితే త్రిగుణ్ మాత్రం తాను అలా పిలవనని స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదిరింది.
మరోవైపు అపూర్వ తనను కావాలనే ప్రతికూలంగా చూపించేందుకు ప్రయత్నిస్తోందని షాలినీ, రోహిత్‌తో చెప్పింది. మిథిలేష్ రెండు రోజులు మాత్రమే ఇంట్లో ఉండి రూ.15 లక్షలు తీసుకెళ్లాడని, ‘అగ్నిపరీక్ష’ బృందం అంతా ఒకటేనని త్రిగుణ్, దేబ్జానీ మాట్లాడుకున్నారు. అనంతరం అర్ధరాత్రి కెప్టెన్ గది నుంచి త్రిగుణ్ కొన్ని డ్రింక్స్ తీసుకెళ్లినట్లు కనిపించింది. దీంతో నాలుగో వారం తొలి ఎపిసోడ్‌లో గొడవలు, గాయాలు, కొత్త వివాదాలు ఆసక్తిని పెంచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!