

దీపావళి పండుగ వేళ దేశంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మధ్యప్రదేశ్‌లో రెండు ఇళ్లలో మంటలు చెలరేగి 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఓ కారు అగ్నికి ఆహుతి కావడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు. పండుగ సంబరాల వేళ చోటుచేసుకున్న ఈ ఘటనలు ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు నింపాయి. భద్రతా చర్యలపై మరోసారి ఆందోళనలను రేకెత్తించాయి.
మధ్యప్రదేశ్‌లోని సివానీ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక నగల వ్యాపారి కుందన్‌లాల్ సోనికి చెందిన మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కుందన్‌లాల్ సోని, ఆయన భార్యతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న మరో అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!