

వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయంటూ పెట్రోల్‌లో ఇథనాల్ శాతం అధికంగా ఉంటోందని వస్తున్న ఫిర్యాదులపై కేరళ ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. కర్ణాటకలో పెట్రోల్ నమూనాలను పరీక్షించగా ఇథనాల్ శాతం 31.2 వరకు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తిరువనంతపురం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో పెట్రోల్ నమూనాల సేకరణ ప్రారంభించింది.
సేకరించిన నమూనాల్లో ఇథనాల్ శాతాన్ని అధికారులు ప్రయోగశాలల్లో పరీక్షించనున్నారు. నిర్ణీత పరిమితికి మించి, అంటే 20 శాతానికి పైగా ఇథనాల్ ఉన్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత పెట్రోల్ బంకులను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై ప్రాసిక్యూషన్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వాహనదారులకు నాణ్యమైన ఇంధనం అందేలా చూడటంతో పాటు ఇంధన నాణ్యతలో అక్రమాలను అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!