

సాఫ్ట్‌వేర్ సంస్థ గిట్‌పాడ్‌లో ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షానన్ బర్న్స్ 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలో జరిగిన వర్క్ ట్రిప్‌లో ఓ ఘటనకు గురయ్యారు. మద్యం సేవించిన అనంతరం తన గది తాళాన్ని మర్చిపోవడంతో గదిలోకి వెళ్లలేకపోయిన ఆమె రాత్రంతా సౌనాలో నిద్రించారు. తనకు ఏడీహెచ్‌డీ ఉందని, ఈ సమస్యకు సంబంధించి సహాయం కూడా కోరినట్లు ఆమె ట్రిబ్యునల్‌కు తెలిపారు. అయితే ఈ ఘటన అనంతరం వృత్తిపరమైన బాధ్యతపై ఆందోళనలు వ్యక్తం చేసిన గిట్‌పాడ్ ఆమెను 2023 జూన్‌లో ఉద్యోగం నుంచి తొలగించింది. 2025లో బర్మింగ్‌హామ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ ఆమె ఏడీహెచ్‌డీ ఈ ఘటనకు దారితీసిన పరిస్థితుల్లో భాగమైందని పేర్కొంటూ, వైకల్య వివక్షకు సంబంధించిన ఆమె వాదనలను సమర్థించింది.
ప్రస్తుతం షానన్ బర్న్స్ గతంలో కోల్పోయిన ఆదాయం, భవిష్యత్తులో కోల్పోయే ఆదాయం, షేర్లకు సంబంధించిన నష్టాలను కలిపి 76.07 మిలియన్ పౌండ్ల పరిహారం కోరుతున్నారు. అయితే గిట్‌పాడ్ ఈ క్లెయిమ్‌ను 1 మిలియన్ పౌండ్లకు పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌ను కోరింది. తాజా విచారణలో ఆ అభ్యర్థనను ట్రిబ్యునల్ తిరస్కరించడంతో బర్న్స్ భారీ పరిహార క్లెయిమ్‌ను కొనసాగించేందుకు అవకాశం లభించింది. గిట్‌పాడ్‌ను ఓపెన్‌ఏఐ కొనుగోలు చేసిన వ్యవహారానికి సంబంధించిన విలువను వెల్లడించాలని కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఆమెకు చెల్లించాల్సిన తుది పరిహారం ఇంకా నిర్ణయించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!