

సౌదీ అరేబియా జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై నవంబర్ 11న హోర్ముజ్ జలసంధిలో దాడి జరిగి ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నౌకలో ఉన్న ముగ్గురు భారతీయ నావికులతో పాటు మొత్తం సిబ్బంది క్షేమంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఎన్‌సీసీ ఫజర్ (NCC FAJR) పేరుతో ఉన్న ఈ ట్యాంకర్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సోనోవాల్ తెలిపారు. నౌకలోని సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించేందుకు షిప్ మేనేజ్‌మెంట్ సంస్థతో అధికారులు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. భారతీయ నావికుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ దాడి యత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!