
రాజకీయాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం శాసనసభ సెంట్రల్ హాల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాటాన్ని, త్యాగాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాగూర్, బాలునాయక్, నవీన్ యాదవ్, మురళీ నాయక్, కోవ లక్ష్మి, ప్రభాకర్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, ఎల్. రమణ పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు. శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి తిరుపతి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!