
జనరల్

ఇంధన సర్‌చార్జి పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదుగా మారనున్నాయి. నేటి నుంచి పెరిగిన సర్‌చార్జి అమల్లోకి రానుండటంతో విమాన టికెట్ల ధరలపై అదనపు భారం పడనుంది. దేశీయ విమానాలపై ప్రయాణ దూరం, విమాన రకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.350 వరకు సర్‌చార్జి పెరగనుంది.
అంతర్జాతీయ విమానాల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి సర్‌చార్జి నిర్ణయించనున్నారు. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు రూ.900 సర్‌చార్జి విధించనున్నారు. అలాగే 1,501 నుంచి 2,000 కిలోమీటర్ల దూరానికి రూ.1,150, 2,000 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు రూ.1,300 సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!