
క్రీడలు

ప్రతిష్ఠాత్మకమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. నేటి నుంచి భక్తులు పవిత్ర హిమలింగ దర్శనం కోసం కాలినడక యాత్రను ప్రారంభించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య వేలాది మంది యాత్రికులు బాల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా పవిత్ర గుహ వైపు ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 57 రోజులపాటు కొనసాగే ఈ యాత్రలో దేశం నలుమూలల నుంచి భక్తులు పాల్గొని పవిత్ర హిమలింగాన్ని దర్శించుకోనున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు పరిపాలన, భద్రత, వైద్య సేవలను విస్తృతంగా ఏర్పాటు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!