
క్రీడలు

కర్ణాటకకు చెందిన 93 ఏళ్ల స్వీట్స్ బ్రాండ్ ధార్వాడ్ బిగ్ మిశ్రా పేడా భారీ పెట్టుబడిని సమీకరించింది. ది వెల్త్ కంపెనీకి చెందిన భారత్ వాల్యూ ఫండ్ నుంచి సంస్థకు ₹300 కోట్ల పెట్టుబడి లభించింది. ఈ నిధులతో వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం కర్ణాటక, గోవా, దక్షిణ మహారాష్ట్రలో 200కుపైగా ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న బిగ్ మిశ్రా పేడా ఏటా సుమారు కోటి మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. సంస్థ ఆదాయం FY22లో ₹142 కోట్ల నుంచి FY26 నాటికి ₹300 కోట్లకు పైగా పెరిగింది. గత మూడేళ్లలో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు సుమారు ₹100 కోట్లు పెట్టుబడి పెట్టింది. వచ్చే రెండేళ్లలో మరో 100 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసి, 50కుపైగా కొత్త నగరాల్లోకి ప్రవేశించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!