
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ఖరారయ్యాయి. గవర్నర్ కోటా కింద ఈ ఇద్దరినీ శాసనమండలికి పంపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ శాసనమండలిలో టీడీపీకి చెందిన మరో ఇద్దరికి ప్రాతినిధ్యం లభించనుంది.
ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు దళవాయి రమాదేవి టీడీపీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!