3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

Writer: Pooja 06:28 AM, 3 అక్టోబర్, 2026
పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. ఇందులో భాగంగా పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ‘పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ 2026’ జరగనుంది. ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ, డీప్‌టెక్‌, స్టార్టప్‌లు, డిజిటల్‌ ఆవిష్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హాజరుకానున్నారు.

‘ఆంధ్రాస్‌ రెసిలెంట్‌ డీప్‌టెక్‌ డికేడ్‌: స్వర్ణాంధ్ర టూ వికసిత్‌ భారత్‌ 2047’ థీమ్‌తో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో సదస్సు నిర్వహించనున్నారు. ఏఐ, డీప్‌టెక్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఆవిష్కరణలపై ప్యానల్‌ చర్చలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు జరగనున్నాయి. ఐఐటీ పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఔత్సాహికులు, ఆవిష్కర్తలు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన సుమారు ఐదు లక్షల మంది ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించేందుకు ముందుకొస్తోంది.

ఇదిలా ఉండగా, పాన్‌ఐఐటీ అలుమ్ని నెట్‌వర్క్‌కు చెందిన ఐఐటీ డైరెక్టర్లు, పరిశ్రమల సీఈవోలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో చంద్రబాబు, లోకేశ్‌ శుక్రవారం రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో విందు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడంపై చర్చించారు. మరోవైపు, క్యూబిట్‌ సంస్థ దేశీయ పరిజ్ఞానంతో మరో నాలుగు ‘క్యూ-శివ’ క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ కంప్యూటర్లను రూపొందించింది. వీటిని శనివారం జరిగే సదస్సులో సీఎం ఆవిష్కరించనున్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఆంధ్రా యూనివర్సిటీ దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పాన్ ఐఐటీ సదస్సుచంద్రబాబు నాయుడునారా లోకేశ్క్వాంటమ్ టెక్నాలజీడీప్ టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!