

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, వృక్ష సంపదను కలిపి పచ్చదనాన్ని రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, పురపాలక, రహదారులు–భవనాలు, విద్య, పరిశ్రమలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని అన్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని నాగబాబు తెలిపారు. మొక్కల సంఖ్య కంటే వాటి నాణ్యత, మనుగడ శాతానికి ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక వాతావరణం, నేలకు అనువైన జాతులను పెంచాలని సూచించారు. రహదారుల వెంట పచ్చదనం, తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్‌లు, మడ అడవులు, ప్రభుత్వ స్థలాల్లో అవెన్యూ, బ్లాక్, మియావాకీ వంటి ప్లాంటేషన్లను ప్రోత్సహించాలని అన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ వనరులను వినియోగించుకోవడంతో పాటు నర్సరీ నుంచి మొక్కల మనుగడ వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు, నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!