
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు లభించాయి. దీంతో రూ.లక్ష కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ముందుకు సాగేందుకు కీలక మార్గం సుగమమైంది. రామాయపట్నం సమీపంలో సుమారు 5,200 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు.
ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పెట్రోల్, డీజిల్‌తో పాటు వివిధ పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక, ఇంధన రంగాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్ట్ పరిధిలో 30 శాతం ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని బీపీసీఎల్ ప్రణాళిక రూపొందించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!