

జమ్మూలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ఓ ఆర్మీ జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బీసీ రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా చందర్కోట్ ప్రాంతానికి చెందిన సంజీత్ సింగ్ (31)గా గుర్తించారు. స్వగ్రామానికి వెళ్లి సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంజీత్ సింగ్ తన స్వగ్రామం నుంచి గుర్దాస్పూర్లోని పోస్టింగ్ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మూ బస్టాండ్ సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఆసుపత్రికి తరలించారు. జవాన్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!