

ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ తెలుగు టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఏపీ ఎఫ్‌డీసీ సభ్యులు బుర్రా సాయి మాధవ్, మీర్, టీవీ అండ్ ఓటీటీ సౌత్ అధ్యక్షుడు ప్రసాద్‌రావు, టీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు నాని, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవాలను ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెలివిజన్ కార్యక్రమాలు, షూటింగ్‌లు మరింతగా నిర్వహించాలని ఆయన పరిశ్రమ ప్రతినిధులను కోరారు. దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని, స్టూడియోలు, షూటింగ్ సదుపాయాల కోసం భూములు కేటాయించాలని ప్రతినిధులు కోరారు. స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఆరోగ్య బీమా, సాధ్యమైతే పెన్షన్, షూటింగ్ సబ్సిడీలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి, సమగ్రంగా చర్చించిన అనంతరం తగిన నిర్ణయాలు తీసుకుంటామని భరత్ భూషణ్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!