

బిగ్‌బాస్ తెలుగు 10లో పదో వారం నామినేషన్లు వాడీవేడిగా సాగుతున్నాయి. స్నేహం, వ్యక్తిగత వ్యాఖ్యలు, ఇంట్లో కంటెస్టెంట్ల ప్రవర్తన వంటి అంశాలపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాం ప్రసాద్ తన గురించి రాసిన నామినేషన్ కార్డుపై నీతూను ప్రశ్నిస్తూ, తన వల్ల అవమానంగా అనిపిస్తే పక్కకు పిలిచి మాట్లాడాల్సిందని అంటాడు. దీనికి స్పందించిన వర్షిణి.. స్నేహం ఉన్నంత మాత్రాన నెగటివ్ పాయింట్లు చెప్పకూడదని లేదని వివరిస్తుంది. మరోవైపు సుధీర్ తనకు నమ్మకద్రోహం చేశాడని వర్షిణి ఆరోపించగా, నీతూ త్రిగుణ్ ప్రవర్తనపై విమర్శలు చేస్తుంది.
నామినేషన్ పాయింట్ల చర్చలో మధ్యలో మాట్లాడుతున్నారనే అంశంపై నీతూ, త్రిగుణ్ మధ్య మరో వాగ్వాదం మొదలవుతుంది. వంశీ కూడా జోక్యం చేసుకుంటూ ఒకరిపై ఒకరు మాట్లాడవద్దని సూచిస్తాడు. ఆ తర్వాత కుటుంబం, వ్యక్తిగత కష్టాలు, ఇంట్లో ఉండేందుకు ఎవరు అర్హులు అనే అంశాలపై మాటలు తీవ్రస్థాయికి చేరతాయి. త్రిగుణ్ తన కుటుంబ కష్టాల గురించి ప్రస్తావించడంతో నీతూ భావోద్వేగానికి గురై తన చెంపపై తానే పలుమార్లు కొట్టుకుంటుంది. గతంలో టాస్క్ సమయంలో వంశీ తనను తాను కొట్టుకున్నప్పుడు నాగార్జున తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతూ ప్రవర్తనపై వారాంతంలో నాగార్జున ఎలా స్పందిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!