

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ కంపెనీలు, మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత దాడులతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లలోని లోపాలను వేగంగా గుర్తిస్తున్నారని హెచ్చరించారు. పౌరుల ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు సైబర్ భద్రతా వ్యవస్థలను, నిపుణులైన సిబ్బందిని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా థర్డ్‌పార్టీ మాడ్యూళ్లు, ఏపీఐ సేవలకు కూడా ప్రధాన అప్లికేషన్లతో సమానమైన భద్రత కల్పించాలని సీపీ సూచించారు. వినియోగంలో లేని పాత ఏపీఐలను తొలగించడం, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, కస్టమర్ పోర్టళ్ల భద్రతను సమీక్షించడం, అసాధారణ లావాదేవీలను గుర్తించే పరిమితులు విధించడం, లబ్ధిదారుల వివరాలను పరిశీలించడం, నగదు బదిలీకి ముందు కేవైసీ పూర్తి చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. కీలక లావాదేవీలకు ఉన్నతాధికారుల ఆమోదం తప్పనిసరి చేయాలని, సిబ్బందికి తరచూ రెడ్ టీమ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైనా, అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్ https://cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!