

సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన వివాదం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి చేరింది. 2023లో తీసుకొచ్చిన నియామకాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో, ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తప్పించడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. కొత్త చట్టం ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రితో కూడిన కమిటీ సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది.
ఈ నియామక విధానం ఎన్నికల సంఘంపై కార్యనిర్వాహక ప్రభావానికి అవకాశం కల్పిస్తోందని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ అంశంపై సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆ విభజిత తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తామని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు వంటి అంశాలపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!