21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

Writer: Shivani K 10:30 AM, 21 ఆగస్టు, 2026
సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్‌ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణరైజింగ్‌ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని బోస్టన్‌, న్యూయార్క్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అనుమతి నిరాకరణతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకుండా ఆగస్టు 23న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అదే సమయంలో అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించి, ఆయా విద్యాసంస్థలతో ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

విద్య, నైపుణ్యాలు, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోయినా, లండన్‌లో తన షెడ్యూల్‌ ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ తదితర ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలను ఏర్పరచుకునే అవకాశాలను పరిశీలించనున్నారు. “తెలంగాణరైజింగ్‌ ఆగదు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాల కంటే ఎంతో ముఖ్యమైనవి” అని సీఎం పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంఅమెరికా పర్యటనకేంద్ర ప్రభుత్వంవిదేశాంగ శాఖతెలంగాణరైజింగ్హైదరాబాద్హార్వర్డ్ యూనివర్సిటీఎంఐటీఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...
జనరల్

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి
సినిమాలు

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!