
క్రీడలు

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం అనంతరం సహాయక చర్యలు చేపట్టగా, అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!