

చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ ) సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. త్రైపాక్షిక సమావేశానికి ముందు పుతిన్‌తో భేటీ అయ్యేందుకు ట్రంప్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పుతిన్‌ను చూపిస్తూ ‘ఆయన ఎవరు?’ అని సరదాగా ప్రశ్నించారు. వెంటనే ‘నా మిత్రుడు’ అంటూ సమాధానమిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు పుతిన్ నవ్వుతూ స్పందించి, ఆయనతో కరచాలనం చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని, ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!