

ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల అభివృద్ధి, మైనింగ్ రంగ విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ (APMDC) ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సంస్థ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఏపీఎండీసీని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఐపీఓకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశంలో వివరించారు. క్వారీ లీజులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత కోసం పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేర్ ఎర్త్ ఖనిజాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా 582 ఖనిజ అన్వేషణ ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొనే అంశంపైనా చర్చించారు. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!