

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్పష్టతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలను పూర్తి కమిషన్ ఏకగ్రీవంగా తీసుకుందని ఈసీ వెల్లడించిన నేపథ్యంలో, ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఇచ్చిన ఉమ్మడి స్పష్టత అపోహలకు ముగింపు పలికిందని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలు సంస్థాగత విధివిధానాలను పాటిస్తూ సమష్టిగా తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడం, భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి బాధ్యత అని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!