
జనరల్

జూలై 1న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్ జీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లాను ముఖ్య వేదికగా ఎంపిక చేశారు.
ఏర్పేడు లేదా ఇనగలూరు ప్రాంతాల్లో పథకం ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శ్రీకాళహస్తి, ఇనగలూరు, ఏర్పేడు, నారాయణవనం ప్రాంతాలను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ప్రారంభోత్సవం ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!