30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

Writer: Nithish 04:21 PM, 30 అక్టోబర్, 2026
తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

తుఫాన్‌ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నరసాపురం మండలం కొత్తనవరసపురంలో పర్యటించిన ఆయన.. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పంటలకు ఎంతమేర బీమా చేయిస్తున్నారని ఆరా తీశారు. ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో పంట నష్టం వాటిల్లినప్పుడు బీమా ద్వారా పరిహారం పొందవచ్చని వివరించారు. ఈ-పంట విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ బీమా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పారు. రైతులు తమ పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. కష్టకాలంలో రైతులకు నష్టం కలగకుండా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులు సహకరిస్తే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలమని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పంట కాలువల్లో కొన్ని చోట్ల నీటి ప్రవాహం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డెల్టా ప్రాంతంలో కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. తుఫాన్‌ కారణంగా ప్రాణనష్టం జరిగిందా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు, హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణనష్టం జరగలేదని వారు వివరించారు. గాలులకు కూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లను అధికారులు వెంటనే తొలగించినట్లు తెలిపారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం.. కార్మికులు, సిబ్బందిని అభినందించారు. నరసాపురం నుంచి మాట్రేవు వెళ్లే మార్గంలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను కూడా పరిశీలించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, తద్వారా పంటలకు డిమాండ్‌ పెరుగుతుందని సూచించారు. నాలుగున్నర ఎకరాల్లో నవధాన్యాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు ఓ మహిళా రైతు ముఖ్యమంత్రికి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మందుబాబులకు షాక్!

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపశ్చిమ గోదావరినరసాపురంతుఫాన్ ప్రభావంపంట నష్టంరైతులుపంటల బీమాఈ-పంటడెల్టా కాలువలుప్రకృతి వ్యవసాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!