

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాల కోసం నిర్దేశించిన గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఉన్న వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ కొత్త వెసులుబాటు 2026 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్ల పాటు కొనసాగనుంది. బీసీ, బీసీ (ముస్లిం), ఎంబీసీ, డీఎన్‌సీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు నిరాశ్రయ వితంతువులకు ఇప్పటికే వర్తిస్తున్న వయోసడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!