30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

Writer: Shivani K 04:55 PM, 30 అక్టోబర్, 2026
సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. పనితీరు ఆధారిత ప్రోత్సాహక బోనస్ కింద మొత్తం రూ.419 కోట్లను చెల్లించనున్నారు. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 బోనస్ అందనుంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దసరా సందర్భంగా లాభాల వాటా బోనస్ కింద దాదాపు రూ.600 కోట్లు చెల్లించగా, తాజాగా దీపావళి బోనస్ ప్రకటించడంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఈ బోనస్ సుమారు 38 వేల మంది సింగరేణి కార్మికులకు వర్తించనుంది. అయితే ఇది జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో కనీసం 190 పని దినాలు, బహిరంగ గనులు, ఉపరితల విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి హాజరు ఆధారంగా నిష్పత్తి ప్రకారం చెల్లిస్తారు. బోనస్ పొందేందుకు కనీసం 30 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి నవంబర్ 5న కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా, దీపావళి బోనస్‌లతో కలిపి ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.2.65 లక్షలు అందనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మందుబాబులకు షాక్!

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

ట్యాగ్లు
సింగరేణి కార్మికులుదీపావళి బోనస్భట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంసింగరేణి కాలరీస్నవంబర్ 5కార్మికుల సంక్షేమంపెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్బోనస్ చెల్లింపుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!