12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయండి.. డీఎస్పీలకు సీఎం రేవంత్‌ సూచన

Writer: Nithish 06:51 AM, 11 నవంబర్, 2026
ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయండి.. డీఎస్పీలకు సీఎం రేవంత్‌ సూచన

తెలంగాణ అభివృద్ధిలో పోలీసు అధికారుల పాత్ర కీలకమని, విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించడంలో వారు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల పోలీస్‌ శాఖలో చేరిన డీఎస్పీలను ఉద్దేశించి మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో నియామకాల్లో జరిగిన జాప్యం, గందరగోళాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పారదర్శక నియామక వ్యవస్థను రూపొందించిందని తెలిపారు. డీఎస్పీల నియామకాల విషయంలోనూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి అనుకూల తీర్పు సాధించిందని పేర్కొన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం నియామకాల్లో పారదర్శకతకు నిదర్శనమని చెప్పారు. పోలీసు అధికారులు తమ నేపథ్యాన్ని మర్చిపోకుండా, ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తూ ఉన్నత పదవులకు ఎదగాలని సూచించారు.

డీఎస్పీలు తమ అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వినియోగించాలని సీఎం సూచించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, వారితో కొంత సమయం మాట్లాడితే సగం సమస్య పరిష్కారమైనట్లేనని అన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు, ఆహార కల్తీ, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు రాష్ట్రానికి ప్రధాన సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉండటానికి ఫోరెన్సిక్‌ నిపుణుల కొరత కూడా కారణమని వివరించారు. పోలీసు అధికారులు తమ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, అవసరమైతే విదేశాల్లో శిక్షణ, అధ్యయన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ అధికారులకు పురస్కారాలు అందజేసి, క్రైమ్‌ సీన్‌ ఫోరెన్సిక్స్‌ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ పోలీస్‌ శాఖడీఎస్పీల నియామకాలుపోలీస్‌ శిక్షణటీజీపీఎస్సీతెలంగాణ ప్రభుత్వంశాంతిభద్రతలుడ్రగ్స్‌ నియంత్రణసైబర్‌ నేరాలుపోలీస్‌ అకాడమీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!