
రాజకీయాలు

అక్వాన్ తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు దిగువకు చేరుతుండటంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమవుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉద్ధృతంగా ప్రవహించి స్థానికులను ఆందోళనకు గురిచేసింది. తాజాగా మరో తుపాను ముప్పు పొంచి ఉండటంతో నదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. గతంలో ఎదురైన పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!