

మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
రేపు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 4న రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా, 5న అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!