
జనరల్

కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద వాయుగుండం ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. సుద్దగడ్డ కొండ కాలువకు వరద నీరు పోటెత్తింది.
గొల్లప్రోలు-తాటిపర్తి ప్రధాన రహదారిపై సుమారు రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటి కారణంగా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!