

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు కూడా ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగేందుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ఎన్నికల సమయంలో రిటైర్డ్ అధికారులు రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయడం లేదా పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారితో పాటు రిటైర్డ్ అధికారులూ ఎన్నికల నిబంధనలను గౌరవించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సూచించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!