

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026కు సంబంధించి ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను నవంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఓటరు జాబితాలో అర్హులైన వారందరి పేర్లు ఉండేలా చూడటంతో పాటు, వివరాల్లో ఉన్న తప్పులు, ఇతర సమస్యలను సరిచేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. సేకరించిన ఫారాల పరిశీలన, తదుపరి చర్యలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇక ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారానికి డిసెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం డిసెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్‌కు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలు తుది జాబితాలో సరిగ్గా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!