

ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన కొత్త చట్టంపై దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనమే విచారిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం గతంలో వెలువరించిన భిన్న తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది.
రీకాల్ పిటిషన్‌తో పాటు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఇచ్చిన రిఫరెన్స్ ఉత్తర్వులపై వ్యక్తమైన అభ్యంతరాలను కూడా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనమే పరిశీలించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగబద్ధతపై ఈ ధర్మాసనం తుది విచారణ చేపట్టనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!